1.

please say any 8 srikalahastishwara poems I want in telugu

Answer»

శ్రీకాళహస్తీశ్వర శతకమును అర్థాలతో

శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనాసేవన్‌ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా! 1సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు కలవాడనై, నీ చిన్మూర్తిని ధ్యానించుచూ బ్రతుకుతాను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతమగును).వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, నిర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య కళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమశ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా! 2ఈశ్వరా! బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని, నీ ఇంటి సింహద్వారదేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టాలను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమోకానీ, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించునట్లు చేసినావు కదా!అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదాకాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవభ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దాజింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా! 3ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము.నీ నా సందొడఁబాటుమాట వినుమా! నీ చేత జీతంబు నేగానిం బట్టక సతతంబు మది వేడ్కంగొల్తు నంతస్సపత్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదేజీ నొల్లన్‌ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా! 4ఈశ్వరా! నీకూ నాకూ అంగీకారమైన మాట ఒకటి చెప్తాను వినుము. నీ నుండి ఏ కాణీ కూడా జీతము ఆశింపక, నిత్యము నిన్ను సేవిస్తాను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు అప్పగింపక రక్షించు. ఆ అనుగ్రహము చాలు. ఇంక నాకు గుర్రాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమీ కోరను.భవకేళీ మదిరా మదంబున మహా పాపాత్ముడై వీడు నన్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోరాశి పాలైనఁ బట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్‌ నూతఁ గూలంగఁ దండ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా! 5జనన మరణ రూపమైన సంసారమనే ఆటలోపడి, కల్లు తాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహాపాపియై నన్ను (భగవంతుని) తెలుసుకొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోతుండగా చూస్తూ ఊరుకుంటావా? ఆటలధోరణిలో బాలుడు బావిలో పడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండా ఊరుకుంటాడా? నీవు నన్ను రక్షింపకుండుట న్యాయము కాదని భావము.స్వామిద్రోహము చేసి వేరొకనిఁ కొల్వన్‌ బోతినో? కాక నేనీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగాఁ జూడనో?యేమీ, యిట్టి వృధాపరాధి నగు న న్నీ దు:ఖవారాశి వీచీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీ కాళహస్తీశ్వరా! 6ఈశ్వరా! నిన్ను కాదని స్వామి ద్రోహము చేసి, మరొక దేవుని సేవించానా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములపై నమ్మకము లేక నిరాదరణ చేసి, నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను, ఈ సంసార దు:ఖసముద్రంలో ముంచి, చూసి వినోదించటం నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించటం నీ కర్తవ్యం కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వారిని నమ్మినవారిని నాస్తికులంటారు.)దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సానువు నీ విల్లు; నిధీశ్వరుండు సఖుఁ డర్ణోరాశి కన్యా విభుండు విశేషార్చకుఁ డింక నీ కెన ఘనుండున్ గల్గునే? నీవు చూచి విచారింపవు; లేమినెవ్వఁడుడుపున్? శ్రీ కాళహస్తీశ్వరా! 7కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండి ఉన్న బంగారు పర్వతము నీకు విల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమిత్రుడు. లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమ భక్తుడు. ఇన్ని ఉన్నా నీకంటే గొప్పవాడెవ్వడు? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి దరిద్రమును పోగొట్టగల సామర్ధ్యము నీకున్నది. అయినా ఆ పని చేయవు. నిన్ను మరిచిపోతానని భయమా? నా మీద నీ అనుగ్రహ దారిద్రమును పోగొట్టేవాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు?నీతో యుద్ధము చేయనోపఁ; గవితానిర్మాణశక్తి నిన్నున్బ్రీతుం చేయగలేను; నీ కొరకుఁ తండ్రిన్ చంపగాఁజాల; నాచేతన్ రోకట నిన్ను మొత్తవెరతున్‌; చీకాకు నా భక్తి, యేరీతిన్నాకిక నిన్నుఁ చూడగలుగున్? శ్రీ కాళహస్తీశ్వరా! 8



Discussion

No Comment Found