1.

Any short friendship story in telugu ????

Answer» HEY MATE :
~~~~~~~~~

రామాపురం అనే ఒక ఊరిలో రాము, సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు ఒక రోజు పొలిమేర దాటి నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు వారి ఇద్దరికీ ఒక విషయం పైన ఒప్పందం కుదరక గొడవపడతారు రాము సోము నీ చెంపపై గట్టిగా కొడతాడు. అప్పుడు సోము " ఈరోజు నా స్నేహితుడు నన్ను చెంపపై కొట్టాడు" అని ఇసుకపై రాస్తాడు.

అలా వారి కొంతదూరం వెళుతుండగా, మధ్యలో సోము ఒక ఊరిలో ఇరుక్కుపోతాడు. అప్పుడు రాము సోము ని కాపాడుతాడు. తర్వాత సోము "ఈరోజు నా స్నేహితుడు నన్ను ఓ పెద్ద అపాయం నుండి కాపాడాడు" అని రాయిపై చెక్కుతాడు. అప్పుడు రాము సోము ని అడుగుతాడు " అరేయ్ మొదట ఇసుక పైన చేతితో రాశావు ఇప్పుడు రాతిపైన చెక్కుతునావు. ఏమైందిరా నీకు".

" నువ్వు నన్ను కొట్టావు అని నేను ఇసుక పైన రాశాను , అది చెరిగిపోతుంది. నువ్వూ నన్ను కాపాడిన ప్పుడు దాన్ని నేను రాతిపై చెక్కాను , అది కలకాలం అలాగే ఉంటుంది " అని సొమ్ము జవాబిచ్చాడు

నీతి :
~~~~

స్నేహితుడు తప్పు చేసినప్పుడు దాన్ని మనం మరచిపోవాలి అదే స్నేహితుడు సహాయం చేసినప్పుడు అది మనం కలకాలం గుర్తుంచుకోవాలి

Hope it hlpz... U


Discussion

No Comment Found